ఢిల్లీ గ్యాంగ్ రేప్: ఆసారాం బాపు వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు
posted on Jan 8, 2013 @ 1:09PM
ఢిల్లీ గ్యాంగ్ రేప్ పై ఆధ్యాత్మిక గురువు అసారాం బాపూ వివాదాస్పద వ్యాఖ్యలు చెసి వార్తల్లోకెక్కారు. ఢిల్లీ రేప్ ఘటనపై దేశమంతటా నిందుతులను నిందిస్తుంటే ఈయన మాత్రం బాధితురాలను కూడా ని౦దిస్తున్నారు. దీంతో అసారాం బాపు వ్యాఖ్యలపై మహిళ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసారాం బాపూ వివాదాస్పద వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఢిల్లీ గ్యాంగ్ రేప్ పై నిన్న అసారాం బాపూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు మాత్రమే దోషులు కారని, రేపిస్ట్ కూడా దోషేనని వ్యాఖ్యానించారు. తనపై రేప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వారిని అన్న అని వేడుకోవాల్సిందని అన్నారు.
ఒక చేతితో చప్పట్లు రావని, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని, బాధితురాలు మర్యాదపూర్వకంగా వేడుకోనివుంటే తనకి ఈ గతి పట్టి ఉండేది కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిందితులను కటినంగా శిక్షిస్తే చట్టాలు దుర్వ్వినియోగం అయ్యే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. ఆధ్యాత్మిక గురువులు అసారాం బాపూ వ్యతిరేకంగా స్పందించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మరి దీనిపై అసారాం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.